అమరావతిలో వైకాపా ఆందోళన... సీఎం నివాసం వద్ద భద్రత పెంపు!
- నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు
- శాంతిభద్రతలపై కీలకచర్చ
- నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం
ఈ నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు సీఎం నివాసం వైపు దూసుకు రావచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. అమరావతి, విజయవాడ ప్రాంతాల నుంచి సీఎం నివాసానికి చేరుకునే మార్గంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా, నేడు శాంతిభద్రతలతో పాటు ఐటీ, పర్యాటకం, రెవెన్యూ తదితర శాఖలపైనా సమీక్ష జరగనుంది.