మెట్రో వచ్చాక... అమీర్ పేటను అధిగమించిన ఎల్బీనగర్!
- ఇప్పటివరకూ అత్యధికులు ప్రయాణిస్తున్న స్టేషన్ గా అమీర్ పేట
- తాజాగా ఆ రికార్డు ఎల్బీ నగర్ కైవసం
- నిత్యమూ 30 వేల మంది ప్రయాణిస్తున్నారన్న ఎన్వీఎస్ రెడ్డి
ఇక, అమీర్ పేట కన్నా ఎల్బీ నగర్ నుంచి అత్యధికులు మెట్రో రైలును ఎక్కుతున్నారని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీ నగర్ లో మెట్రో రైలు సేవలను నిత్యమూ 30 వేల మంది పొందుతున్నారని, రెండు రూట్లలో రోజుకు దాదాపు 1.75 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.