ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తిన పూజా హెగ్డే
- చాలా మంచివాడు.. దయాగుణం ఎక్కువ
- కథ చెబుతున్నప్పుడే ఫిక్స్ అయిపోయా
- ప్రభాస్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది
దర్శకుడు రాధాకృష్ణ తనకు కథ చెబుతున్నప్పుడే ఈ సినిమాలో నటించాలని ఫిక్స్ అయినట్టు పూజా వెల్లడించింది. ప్రభాస్ చాలా సరదాగా ఉంటాడని.. చాలా మంచి మనిషని.. దయాగుణం ఎక్కువని పూజా తెలిపింది. ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడని.. ప్రభాస్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పూజా హెగ్డే స్పష్టం చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ రూపొందుతోంది.