Keeravani: బాలయ్య 'ఎన్టీఆర్'కు అన్న.. వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు తమ్ముడు... రంగంలోకి కల్యాణి మాలిక్!

షార్ట్స్‌లో చూడండి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఎంఎం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ కు లభించింది. జీవీ ఫిల్మ్ సమర్పణలో తాను రూపొందించనున్న చిత్రానికి ప్రస్తుతం నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు వర్మ. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత వారాంతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కల్యాణి మాలిక్ ను తీసుకున్నామని చెప్పారు వర్మ.

ఇక ఇదే సమయంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ కు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేసిన వర్మ, కీరవాణి సోదరుడైన కల్యాణి మాలిక్, అనుకోకుండా తన సినిమా కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఇది నిజంగా కాకతాళీయంగా జరిగిందని, ఉద్దేశ పూర్వకంగా ఆయన్ను ఈ ప్రాజెక్టుకు తీసుకోలేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కల్యాణి మాలిక్‌ తో కలిసి దిగిన ఫొటోను ఈ సందర్భంగా వర్మ షేర్‌ చేశారు.
Go Back to Shorts
Keeravani
Varma
Kalyanimalik
NTR
Balakrishna

More Telugu News