నేను, తారక్ చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: బాలయ్య
Add ap7am to your home Screen

నేను, తారక్ చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: బాలయ్య

  • మా చిత్రాల్లో నవరసాలు ఉండాలి
  • అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నా
  • అభిమానులంతా క్రమశిక్షణతో ఉండాలి
తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు, చైతన్య రథ సారధి, మా అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేరంటే నమ్మలేక పోతున్నానని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు. 'అరవింద సమేత' చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు మొదట తాను అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. తాను ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయానని తెలిపారు. మహిళ అంటే ఎంతో గొప్పది అనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు.

తాను, తారక్ చేసే సినిమాలు మరెవరూ చేయలేరని, అసాధ్యమని ఈ సందర్భంగా బాలయ్య అన్నారు. తమ చిత్రాల్లో నవరసాలు ఉండాలని చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలను గొప్పగా తీస్తారని కితాబిచ్చారు. చారిత్రక సినిమాలు, పోరాట చిత్రాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరని అన్నారు. తమ అభిమానులంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. జోహార్ హరికృష్ణ, జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు.
Balakrishna
ntr
aravinda sametha

More Telugu News