వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను.. ఇప్పుడు వాళ్లతోనే నటిస్తున్నాను!: కీర్తి సురేష్
- చిన్నప్పటి నుంచి హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను
- వారితో నటించే అవకాశాలు వస్తున్నాయి
- ఈ విషయం చెబితే, వయసు గుర్తొచ్చి హీరోలు హర్ట్ అవుతారన్న కీర్తి
తాను ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు వారితోనే కలసి నటించే అవకాశాలు వస్తున్నాయని, అయితే, ఏ హీరో దగ్గర కూడా ఈ విషయాన్ని తాను ప్రస్తావించబోనని వెల్లడించింది. హీరోల దగ్గర 'చిన్నప్పుడు మీ సినిమాలు చూస్తూ పెరిగాను' అంటే వారికి వయసు గుర్తుకు వచ్చి హర్ట్ అవుతారని అనుకుంటున్నట్టు చెప్పింది. హీరోలంటే తనకెంతో గౌరవమని, వాళ్లను కొలీగ్స్ గా భావించలేనని, ఈ అవకాశాలు, గుర్తింపు అంతా దేవుడి దయని చెప్పుకొచ్చిందీ అందాల భామ.