sai dharamtej: మెగా హీరో కొత్త సినిమా ప్రారంభం!

షార్ట్స్‌లో చూడండి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నూతన చిత్రం కాసేపటి క్రితం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సాయి ధరమ్ తేజ్11వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'చిత్ర లహరి' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధిగా హాజరయ్యి క్లాప్ నిచ్చారు. 'రంగస్థలం, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలని అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నాడు.
Go Back to Shorts
sai dharamtej
Tollywood
Hyderabad

More Telugu News