రాజమౌళి మల్టీస్టారర్ అప్‌డేట్!
- ప్రత్యేక వర్క్‌షాప్‌కు వెళ్లనున్న తారక్, చెర్రీ
- మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం!
- డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం. తారక్, చెర్రీ ఈ చిత్రం కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌కు వెళ్లనున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరొక ఆసక్తికర వార్త బాగా ప్రచారంలో ఉంది. జక్కన్న ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్‌ని ప్రారంభించారని సమాచారం. ప్రస్తుతం కీరవాణి అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అంతా ఓకే అయితే ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.