'పందెం కోడి 2' రాక పక్కాగా ఖరారైపోయింది
- లింగుస్వామి నుంచి 'పందెం కోడి 2'
- విశాల్ సరసన కీర్తి సురేశ్
- కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
'అరవింద సమేత' హిట్ టాక్ తెచ్చుకోవడం వలన, 'పందెం కోడి 2' విడుదల తేదీ మారే అవకాశం వున్నట్టుగా ప్రచారం మొదలైంది. దాంతో ఈ సినిమా టీమ్ స్పందించింది. ముందుగా అనుకున్నట్టే తాము ఈ నెల 18వ తేదీనే రానున్నట్టుగా 'పందెం కోడి 2' టీమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పందెం కోడి 2' సినిమా కూడా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించింది.