'వెంకట్రావ్ కోట'లో షూటింగుకి వచ్చిన హీరో రాజశేఖర్ కుటుంబ సభ్యులు!
- సూర్యాపేట సమీపంలోని నడిగూడెంలో షూటింగ్
- దొరల కుటుంబ నేపథ్యంలో కథ
- కోట పటిష్ఠతపై స్థానికులతో రాజశేఖర్ ఆరా
దొరల కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుండగా, కోట పటిష్ఠతపై స్థానికులతో రాజశేఖర్ మాట్లాడారు. తమ అభిమాన నటుడు వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్, రాజశేఖర్ దంపతులను చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. రాజశేఖర్, జీవితలతో పాటు వారి ఇద్దరు కుమార్తెలు కూడా నడిగూడెం రావడంతో గ్రామంలో సినిమా సందడి నెలకొంది. కోటలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.