Chandrababu: మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు!: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి తాము పోరాడుతున్నామని, ‘హోదా కావాలి’ అనే మాటమీదనే ఉన్నామని, దానిని వ్యతిరేకించింది, మాట మార్చింది సీఎం చంద్రబాబేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు. ఆయన చెప్పిన మాటలు ఆయనే మర్చిపోయారు. ‘స్పెషల్ కేటగిరి స్టేటస్ వద్దని నేను చెప్పలేదు’ అని ఆయన (చంద్రబాబు) అంటారు. ఆయన మాటలు ఆయనకు రికార్డు చేసి చూపించినా.. సాక్ష్యం చూపించినా కూడా, ‘ఎవరో అన్నారు నేను కాదు’ అని ఆయన అంటారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
Go Back to Shorts
Chandrababu
Pawan Kalyan

More Telugu News