ఆ పార్టీ పాకిస్థాన్ క్రికెట్ టీం లాంటిది: కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు
- పాక్ టీమ్ లో ఒకరు కెప్టెన్.. మిగిలిన సభ్యుల్లో మాజీ కెప్టెన్ లు ఉన్నారు
- టీ-కాంగ్రెస్ లో 30 మంది సీఎం అభ్యర్థులుంటారు!
- ఎన్నికలకు సిద్ధమంటారు, మరో వైపు కోర్టుకు పోతారు
వాళ్ల పార్టీలో సుమారు ముప్పై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారని, పక్కింటి వాళ్లు కూడా ఓట్లెయ్యని వాళ్లు కూడా సీఎం అభ్యర్థిని కావాలని కోరుకునే వారు ఆ పార్టీలో చాలామందే ఉన్నారని విమర్శించారు. ఒకవైపు ఎన్నికలకు సిద్ధమంటారు, మరో వైపు కోర్టుకు పోయి బ్రతిమలాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలపై సెటైర్లు విసిరారు. ‘అయ్యా ఎన్నికలు వాయిదా వేయండి.. జల్దీగా ఎన్నికలు పెడితే ప్రజలు వీపు పగలగొట్టేట్టు ఉన్నారని బతిమలాడుతున్నారు’ అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.