polavaram: పోలవరం స్పిల్‌ వే నిర్మాణం పూర్తి కావచ్చింది : మంత్రి దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన స్పిల్‌వే నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబరులో గేట్లు అమరుస్తామని ఆంధ్రప్రదేశ్‌ జవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

స్పిల్‌ వే పనుల్లో మరో ఐదు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి పూర్తయితే సిద్ధమైనట్టేనని చెప్పారు. మంగళవారం మంత్రి ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసేందుకు ముమ్మరంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి వెంట సీఈ వి.శ్రీధర్‌, నవయుగ కంపెనీ ఎండీ కె.శ్రీధర్‌ ఉన్నారు.
Go Back to Shorts
polavaram
minister uma

More Telugu News