లైంగికంగా వేధిస్తున్నాడు: ముంబై బీజేపీ నేతపై మహిళా నేత ఫిర్యాదు
Add ap7am to your home Screen

లైంగికంగా వేధిస్తున్నాడు: ముంబై బీజేపీ నేతపై మహిళా నేత ఫిర్యాదు

  • ముంబై ధారవి అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ అధ్యక్షుడిపై కేసు నమోదు
  • లైంగికంగా వేధిస్తున్నాడంటూ పార్టీ కార్యదర్శి దివ్య ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లైంగిక వేధింపులు సినీ పరిశ్రమ, వర్కింగ్ ప్లేసుల్లోనే కాదు... రాజకీయరంగంలో కూడా ఉన్నాయనే విషయాన్ని ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. ముంబై మురికివాడ ధారవి అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగిన ఈ ఘటన బీజేపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. తమ పార్టీకే చెందిన నేత తనను తిట్టడంతో పాటు లైంగికంగా వేధించాడని అదే పార్టీకి చెందిన మహిళా నేత పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ధారవి అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ అధ్యక్షుడు మణిబాలన్ పై ఆ పార్టీ కార్యదర్శి దివ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ సామాజిక సేవల్లో భాగంగా నిధులను తీసుకొచ్చి మురికివాడను అభివృద్ధి చేస్తుంటే... మణిబాలన్ తనను దూషించడమే కాకుండా, లైంగికంగా కూడా వేధించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
mumbai
dharavi
bjp
leader
sexual assault
case

More Telugu News