Harish Rao: తెలంగాణను నిలబెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. పడగొట్టాలని టీడీపీ చూస్తోంది!: హరీశ్ రావు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణను నిలబెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే, పడగొట్టాలని టీడీపీ చూస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో టీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై ఆయన నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లాలోని కోడూరు మండలం మందపల్లి గ్రామస్థులు ఏర్పాటు చేసిన తీర్మానసభకు హాజరైన హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పై పోటీ పడేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, వారికి జెండా, అజెండా ఏమీ లేదని, పాతబట్టలన్నీ కలిపి కుట్టిన బొంతలా మహాకూటమి పరిస్థితి ఉందని విమర్శించారు.
Go Back to Shorts
Harish Rao
Chandrababu

More Telugu News