సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రభాస్ షూటింగులో జాయిన్ అయిన పూజ
- హీరోగా ప్రముఖ నిర్మాత తనయుడు
- నాని హీరోగా గీతా ఆర్ట్స్ చిత్రం
* 'పెళ్లి చూపులు' చిత్రంతో నిర్మాతగా వెలుగులోకి వచ్చిన రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. 'జయమ్ము నిశ్చయమ్మురా' ఫేం శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శివ కందుకూరి హీరోగా నటిస్తాడు. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి నిర్మిస్తారు.
* 'బ్రహ్మోత్సవం' చిత్రం పరాజయం కావడంతో గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇందులో నాని హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.