సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మాస్ పాత్రలూ చేస్తానంటున్న కీర్తి 
  • కన్నడ సినిమాలో ఈషా రెబ్బా 
  • విలన్ గా నటిస్తున్న రచయిత 
  • పరశురాంతో మైత్రీ మూవీస్ సినిమా
*  ఫలానా తరహా పాత్రలకే తాను పరిమితం కాదలచుకోలేదని అంటోంది అందాలభామ కీర్తి సురేశ్. "మాస్ తరహా పాత్రలు కూడా చేయాలి కదా, అందుకే స్వామి, పందెంకోడి 2 చిత్రాలలో ఆ తరహా పాత్రలు చేశాను. ఆర్టిస్టన్నాక అన్ని పాత్రలూ చేయాలి. అప్పుడే పెర్ఫెక్ట్ అవుతాం. నా ప్రయత్నం అదే' అని చెప్పింది.
*  తాజాగా 'అరవింద సమేత' చిత్రంలో నటించిన టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఇప్పుడు కన్నడ చిత్ర రంగానికి కూడా వెళుతోంది. సూపర్ స్టార్ శివరాజకుమార్ హీరోగా రూపొందే చిత్రంలో ఈషా నాయికగా నటిస్తుందట.
*  ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఆర్టిస్టుగా మారుతున్నాడు. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రంలో అబ్బూరి రవి విలన్ పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
*  తాజాగా 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన పరశురాం తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించడానికి అంగీకరించారు. ఇప్పటికే ఈయన గీతా ఆర్ట్స్ లో మరో చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పిన సంగతి విదితమే.
Keerthi
Eesha
vijay

More Telugu News