దుమ్మురేపేస్తోన్న 'పందెం కోడి 2' ట్రైలర్

  • తెలుగు .. తమిళ భాషల్లో 'పందెం కోడి 2'
  • ఆకతాయి అమ్మాయిగా కీర్తి సురేశ్  
  • వచ్చేనెల 18వ తేదీన విడుదల    
విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో కొంతకాలం క్రితం 'పందెం కోడి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అదే కాంబినేషన్లో 'పందెం కోడి 2' వచ్చేనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ దృశ్యాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఆకతాయి అమ్మాయిగా కీర్తి సురేశ్ కనిపిస్తోంది. ఇక నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఆకట్టుకునేలా వుంది. "జాతరలో పులి వేషాలు వేయొచ్చు .. కానీ పులిముందే వేషాలు వేయకూడదు" అనే డైలాగ్ బాగా పేలింది. ఈ ట్రైలర్ ని బట్టి చూస్తుంటే. 'పందెం కోడి 2' కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తోంది. 
 
Go Back to Shorts
vishal
keerthi suresh

More Telugu News