విజయవాడ వచ్చీ రాగానే అరకు, పాడేరుకు పయనమవుతున్న చంద్రబాబు!
- మధ్యాహ్నం ఒంటిగంటకు పాడేరుకు సీఎం
- కిడారి కుటుంబానికి పరామర్శ
- ఆపై అరకులో సివేరి సోమ ఇంటికి చంద్రబాబు
ఆపై అరకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులనూ పరామర్శిస్తారు. కాగా, ఇప్పటికే అరకు, పాడేరు ప్రాంతాన్ని పోలీసులు, కూంబింగ్ దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. నిన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ అరకు, డుంబ్రిగూడ, లివిటిపుట్టు ప్రాంతాల్లో పర్యటించి, కిడారిని హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. వీఐపీల పర్యటనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.