balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర గురించి ఫిల్మ్ నగర్ టాక్

షార్ట్స్‌లో చూడండి
నందమూరి అభిమానులంతా 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా .. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటించారు. రీసెంట్ గా అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ లుక్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అప్పట్లో కథానాయకులుగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుండేది. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఈ కారణంగానే ఈ ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ ఎంతసేపు కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కాంబినేషన్లో 3 - 4 సీన్లు మాత్రమే వుండనున్నాయనేది తాజా సమాచారం. రాజకీయాలలోకి రావడానికి ముందు ఏఎన్నార్ తో ఎన్టీఆర్ జరిపిన ఆసక్తికరమైన చర్చ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.   
Go Back to Shorts
balakrishna
sumanth

More Telugu News