హరీశ్‌రావు అంటే ఎంతిష్టమో.. ఉచితంగా క్షవరం చేస్తున్న యువకుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరీశ్‌రావు అంటే ఎంతిష్టమో.. ఉచితంగా క్షవరం చేస్తున్న యువకుడు!

  • హరీశ్‌రావుపై అభిమానంతో ఉచిత క్షవరం
  • సిద్ధిపేట యువకుడి వినూత్న కార్యక్రమం
  • సన్మానం చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు
తెలంగాణలో ఎన్నికల వేడి పూర్తిస్థాయిలో రాజుకోనేలేదు.. అభిమానులు మాత్రం ఆయా పార్టీలపై తమకున్న ‘భక్తి’ని చాటుకుంటున్నారు. టీఆర్ఎస్ అగ్రనేత హరీశ్‌రావు అంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఓ నాయీ బ్రాహ్మణ యువకుడు ఉచితంగా క్షవరం చేసేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో హరీశ్‌రావుకు కనీసం లక్ష ఓట్ల ఆధిక్యం రావాలంటూ సిద్ధిపేటకు చెందిన యువకుడు కొత్వాల్ శ్రీనివాస్ ఈ వినూత్న ప్రచారాన్ని బుధవారం ప్రారంభించాడు.

హరీశ్‌రావుకే ఓటు వేయాలంటూ సొంతంగా ఓ ఫ్లెక్సీని తయారు చేయించిన శ్రీనివాస్.. అందులో ఉచితంగా కటింగ్, షేవింగ్ చేయబడునని రాశాడు. ఆ బోర్డును ఓ ఫుట్‌పాత్‌పై పెట్టి వచ్చీ పోయే వారికి క్షవరం చేస్తున్నాడు. ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత క్షవరం చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని శ్రీనివాస్ తెలిపాడు. తమ సామాజిక వర్గానికి ఎంతోమేలు చేసిన హరీశ్ రావుకు తన వంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నాడు. ఉచిత క్షవర కార్యక్రమం ప్రారంభం సందర్భంగా శ్రీనివాస్‌కు సంఘీభావంగా మరో ముగ్గురు యువకులు కూడా ఉచితంగా క్షవరం చేశారు. వీరందరికీ స్థానిక ప్రజా ప్రతినిధులు సన్మానం చేశారు.  
Telangana
Harish Rao
TRS
Siddipet District
Election

More Telugu News