చంద్రబోస్ గారి పాటలు నాకు అసూయను కలిగిస్తాయి: అనంత శ్రీరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబోస్ గారి పాటలు నాకు అసూయను కలిగిస్తాయి: అనంత శ్రీరామ్

  • సిరివెన్నెల గారి పాటలంటే ఇష్టం 
  • చంద్రబోస్ పాట నిర్మాణం బాగుంటుంది 
  • నా పాట నచ్చితే ఆయన ఫోన్ చేస్తాడు
తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడారు. పాటలో విషయాన్ని సూక్ష్మంగా చెప్పడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి శైలి తనకి ఎంతగానో నచ్చుతుందని చెప్పిన అనంత శ్రీరామ్, చంద్రబోస్ గురించి కూడా ప్రస్తావించాడు . "నా తరువాత సవాల్ చేసే స్థాయికి యువ రచయితలు వచ్చినట్టుగా నేను అనుకోవడం లేదు. నా కన్నా ఎక్కువ పాటలు రాస్తున్నంత మాత్రాన సవాలు చేసినట్టు కాదు.

ఒక పాట వింటే ఆనందం కలగడం వేరు .. అసూయ పడటం వేరు. నా కంటే ముందుగా వచ్చిన చంద్రబోస్ గారు రాసే పాటలు నాకు అసూయను కలిగించాయిగానీ, ఆ తరువాత వచ్చిన వారి పాటలేవీ నన్ను అసూయపెట్టలేదు. చంద్రబోస్ గారు రాసిన ఏ పాట అయినా అసూయకి గురి చేస్తుంది. పాటను ఆయన నిర్మించే విధానం బాగుంటుంది. ఒకసారి వినగానే శ్రోతలు పాడుకునేలా పాట రాయడం ఆయన ప్రత్యేకత. నా పాట ఏదైనా నచ్చితే వెంటనే ఆయన ఫోన్ చేసి అభినందిస్తూ వుంటారు" అని చెప్పుకొచ్చాడు.   
ananth sriram

More Telugu News