ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్రలో నిత్యామీనన్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్రలో నిత్యామీనన్

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • ముఖ్య పాత్రల్లో రానా .. సుమంత్ .. రకుల్ 
  • జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు
క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ .. చాలా వేగంగా షూటింగు జరుపుకుంటోంది. ఒక వైపున చకచకా షూటింగు కానిచ్చేస్తూనే, మరో వైపున చంద్రబాబు నాయుడిగా రానా లుక్ .. ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ను వదిలారు. శ్రీదేవి పాత్రకి గాను రకుల్ ప్రీత్ ను తీసుకున్న ఈ సినిమా టీమ్, సావిత్రి పాత్రకి గాను నిత్యామీనన్ తీసుకున్నట్టుగా సమాచారం.

'మహానటి' సినిమాలోనే సావిత్రిగా నిత్యామీనన్ చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన చేయలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించే అవకాశం ఆమెకి దక్కింది. 'మాయాబజార్' .. 'మిస్సమ్మ' .. 'గుండమ్మ కథ' .. 'రక్త సంబంధం' సినిమాలకి సంబంధించిన సీన్స్ లో నిత్యామీనన్ సావిత్రిలా కనిపించనుందని అంటున్నారు. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు       
balakrishna
nithya menon

More Telugu News