‘సడక్-2’ టీజర్ ను రిలీజ్ చేసిన ఆలియా
- 27 ఏళ్ల తర్వాత తెరకెక్కనున్న ‘సడక్’కు సీక్వెల్
- మహేష్ భట్ జన్మదినం సందర్భంగా టీజర్
- 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు సీక్వెల్
ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. 27 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తోంది చిత్రబృందం. మరి అదే కథను కొనసాగిస్తారా? లేదంటే కొత్త కథను ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘సడక్-2’ అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆలియా, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, పూజాభట్ నటించనున్నారు. నేడు(గురువారం) మహేష్ భట్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆలియా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో ‘సడక్’లోని కొన్ని సన్నివేశాలను చూపించారు. ఈ చిత్రం 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.