ఎన్టీఆర్ నోట్లోని సిగరెట్ వెలిగిస్తూ అక్కినేని .. బయోపిక్ పోస్టర్ అదిరింది!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ నోట్లోని సిగరెట్ వెలిగిస్తూ అక్కినేని .. బయోపిక్ పోస్టర్ అదిరింది!

  • క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • అక్కినేని పాత్రలో నటించిన సుమంత్ 
  • ఏఎన్నార్ జయంతి సందర్భంగా మరో పోస్టర్      
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కథానాయకులుగా ఇద్దరూ ఇద్దరే. పౌరాణిక చిత్రాల్లో తనకి తిరుగులేదని ఎన్టీ రామారావు నిరూపిస్తే , సాంఘిక చిత్రాల్లో ఏఎన్నార్ అదరగొట్టేశారు. సోలో హీరోలుగా వరుస సినిమాలు చేస్తూనే .. అవకాశం దొరికినప్పుడల్లా కలిసి నటించారు. విజయాలను అందుకునే విషయంలో పోటీపడుతూనే ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ రోజున ఏఎన్నార్ జయంతి కావడంతో, ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను పోషిస్తోన్న సుమంత్ లుక్ ను ఉదయం రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      
balakrishna
sumanth

More Telugu News