కీర్తి సురేశ్ ఆ సినిమా చేయడం లేదని చెప్పడానికి అదే కారణమట!
- శశికుమార్ తో సినిమాకి నో
- వెంకట్ ప్రభు సినిమాకి డేట్స్
- త్వరలోనే అధికారిక ప్రకటన
తాజాగా ఈ విషయంపై కీర్తి సురేశ్ స్పందిస్తూ .. తాను ఈ ప్రాజెక్టు చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. అయితే ఆమె ఇలా చెప్పడానికి కారణం .. దర్శకుడు వెంకట్ ప్రభు ప్రాజెక్టులో చేయడానికి అంగీకరించడమేననే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తి సురేశ్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందట. అందువల్లనే ఆమె శశికుమార్ సినిమాకి కాకుండా వెంకట్ ప్రభు సినిమాకి డేట్స్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం వుందట. ఇక శశికుమార్ సినిమాలో కథానాయికగా ఎవరికి చోటు దొరుకుతుందో చూడాలి.