పెట్రో ధరలు పైపైకే: పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 24 పైసలు పెంపు!

  • కొనసాగుతున్న ధరాఘాతం
  • సెప్టెంబరు 5, 12 తేదీల్లో మాత్రమే పెరగని ధర
  • వినియోగదారుల జేబుకు చిల్లు
పెట్రో ధరల ఆకాశయానం కొనసాగుతోంది. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 24 పైసలు చొప్పున మళ్లీ పెరిగింది. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై 4.83 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయలు పెరిగింది. సెప్టెంబర్‌ 5, 12 తేదీల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ధర పెరుగుతూనే ఉంది. తాజా పెంపుతో పెట్రో ధరలు అధికంగా ఉండే ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.89.01, డీజిల్‌ రూ.78.07కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.86.18, డీజిల్‌ రూ.79.73కు, విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.85.41, డీజిల్‌ రూ.78.63కు చేరింది.
Go Back to Shorts
petrol
diesel

More Telugu News