'నరసింహనాయుడు'లో ఆ పవర్ఫుల్ డైలాగ్ అప్పుడు రాశాను: పరుచూరి గోపాలకృష్ణ
Add ap7am to your home Screen

'నరసింహనాయుడు'లో ఆ పవర్ఫుల్ డైలాగ్ అప్పుడు రాశాను: పరుచూరి గోపాలకృష్ణ

  • 'నరసింహనాయుడు' షూటింగు జరుగుతోంది 
  • దర్శకుడు బి. గోపాల్ నా దగ్గరికి వచ్చాడు 
  • బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ డైలాగ్ కావాలన్నాడు
పరుచూరి బ్రదర్స్ కథలు బలమైనవి .. వాళ్ల మాటలు పదునైనవి అని ప్రేక్షకులంతా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ 'నరసింహ నాయుడు' సినిమాను గురించి ప్రస్తావించారు.

"ఈ సినిమాకి సంబంధించి ఆ రోజున ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నారు .. ఆ తరువాత గుమ్మడికాయ కొట్టేస్తారు. ఆ సమయంలో దర్శకుడు బి.గోపాల్ వచ్చి .. 'సార్ ఇది సినిమాలో ఆఖరి సీన్ గా వస్తుంది .. బాలకృష్ణకి ఏదైనా డైలాగ్ పడుతుందేమో చూడండి' అన్నాడు. 'సమరసింహా రెడ్డి'లోని .. 'తొడగొడితే ఆ సౌండ్ కి చచ్చిపోతావ్' అనే స్థాయి డైలాగ్ కావాలి' అని అడిగాడు.

అప్పుడు ఒక్క క్షణం ఆలోచించి 'ప్లేస్ నువ్ చెప్పినా సరే .. నన్ను చెప్పమన్నా సరే, టైమ్ నువ్ చెప్పినా సరే .. నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే .. కత్తులతో కాదురా .. కంటి చూపుతో చంపేస్తా' అని రాశాను. ఆ డైలాగ్ వినిపించగానే గోపాల్ నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ డైలాగ్ ను ఇప్పటికీ చిన్నపిల్లలు కూడా చెప్పుకుంటూ ఉండటం విశేషం" అని అన్నారు. 
Balakrishna

More Telugu News