ds: పార్టీలోకి వచ్చేయండి.. అన్నీ నేను చూసుకుంటా: డీఎస్ తో ఉత్తమ్

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) మళ్లీ సొంత గూటికి చేరేందుకు మార్గం సుగమమవుతోంది. ఆయనతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు అరగంట సేపు మంతనాలు జరిగాయి. ఈ సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలని డీఎస్ ను ఉత్తమ్ ఆహ్వానించారు.

కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. మీరు ఓకే చెబితే... సోనియాగాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో పార్టీలో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ తాను చూసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై డీఎస్ ఏ విధంగా స్పందించారనే విషయం తెలియరాలేదు.
Go Back to Shorts
ds
Uttam Kumar Reddy
congress
TRS

More Telugu News