చంద్రబాబు నాయుడిగా రానా ఫస్టులుక్ ఇదిగో!
Add ap7am to your home Screen

చంద్రబాబు నాయుడిగా రానా ఫస్టులుక్ ఇదిగో!

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • వినాయక చవితి సందర్భంగా ఫస్టులుక్ 
  • సంక్రాంతికి భారీ రిలీజ్  
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పాత్ర కోసం రానాను తీసుకున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవల చిత్రీకరించారు.

రేపు వినాయక చవితి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రానా ఫస్టులుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడి పోలికలకు దగ్గరగా రానా లుక్ ను తీసుకురాగలిగారు. ఒక రకంగా రానా కెరియర్లో ఇది ప్రత్యేకమైన పాత్ర అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు .. శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.    
raana
balakrishna
rakul

More Telugu News