వసంత నాగేశ్వరరావు ఫోన్ బెదిరింపులపై చంద్రబాబు సీరియస్!
- ఇది చాలా తీవ్రమైన విషయమన్న చంద్రబాబు
- ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించినా.. కఠిన చర్యలు తప్పవు
- ఇలాంటి బెదిరింపులను సహించం
ఓ మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించినా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులను సహించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ సందర్భంగా, ఇప్పటికే వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదైందని చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు.