Pawan Kalyan: పవన్ కల్యాణ్... మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు.