Chandrababu: గుంటూరు సభలో సీఎం చంద్రబాబుపై దాడికి యత్నం జరిగింది: వైసీపీపై బుద్ధా వెంకన్న ఆరోపణలు

షార్ట్స్‌లో చూడండి
గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభలో సీఎం చంద్రబాబుపై దాడి యత్నం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ సభలో నంద్యాల వైసీపీ కార్యకర్తలతో అలజడి సృష్టించారని అన్నారు. నాడు తునిలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులతో రైలు తగులబెట్టించారని వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు. తన తండ్రి వైఎస్ బాటలోనే జగన్ నడుస్తూ మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ, జగన్ ఆడుతున్న డ్రామాల్లో ఇది ఒక నాటకమని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం బాగుపడటం జగన్ కు ఇష్టం లేదు

గుంటూరు సభలో వైసీపీ తమ కార్యకర్తలతో అల్లరి చేయించిందని, ఇది హేయమైన చర్య అని మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడటం జగన్ కు ఇష్టం లేదని, కేంద్రం, జగన్ ఇద్దరూ కలిసి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 
Go Back to Shorts
Chandrababu
buddha venkanna

More Telugu News