దుమ్మురేపేస్తోన్న 'పందెం కోడి 2' టీజర్
- విశాల్ నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- దసరాకి ప్రేక్షకుల ముందుకు
ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ అనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. లవ్ .. యాక్షన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ విలనీ షేడ్ ప్రధానంగా ఈ టీజర్ కొనసాగింది. "నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు .. అడ్డుకోవడమే మొదలు పెట్టాను" .. "ఇది పులి .. మేక ఆట కాదు .. పులి - మేక కలిసి ఆడే ఆట" అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.