Harikrishna: నాన్న దగ్గరికి వెళితే జైల్లోకి వెళ్లినట్టే... హరికృష్ణ చిన్నతనం జ్ఞాపకాలు!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న వేళ హరికృష్ణ, తన తాతయ్య లక్ష్మయ్య చౌదరి వద్దే ఉంటూ, నిమ్మకూరులో పెరిగారు. తనకు ఇష్టమైనట్టుగా, ఎంతో సరదాగా బాల్యం గడచిపోయిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న హరికృష్ణ, ఆ సమయంలో తండ్రి వద్దకు వెళితే, జైలుకు వెళ్లినట్టుగానే అనుకునేవాడినని చెప్పారు. తనకు తల్లీ, తండ్రీ అన్నీ తాతయ్యేనని, మద్రాసుకు కేవలం చుట్టం చూపుగా వెళ్లి, తండ్రి దగ్గర నాలుగు రోజులుండి వచ్చే వాడినని అన్నారు. ఆ నాలుగైదు రోజులు కూడా, ఎప్పుడెప్పుడు వెళ్లిపోతామా? అన్నట్టుగా ఉండేదని అన్నారు. పల్లెటూరులోని గాలి, ఆ పచ్చటి వాతావరణం, పొలాలు తనకెంతో ఇష్టమని చెప్పారు.
Go Back to Shorts
Harikrishna
NTR
Jail
Madras
Chennai

More Telugu News