'సైరా' సెట్ కు వెళ్లి చిరంజీవికి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలయ్య!
- 'సైరా' షూటింగ్ లో బిజీగా చిరంజీవి
- హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్
- అక్కడికి వెళ్లి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలయ్య
చిరంజీవిని, చిత్ర టీమ్ ను అభినందించిన బాలయ్య, చిత్రం బాగా రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వీరిద్దరూ సెట్స్ లో చాలా సేపు ముచ్చట్లాడుతూ కూర్చున్నారని తెలుస్తుండగా, ఈ కలయికకు సంబంధించిన చిత్రాలు బయటకు రాలేదు. కాగా, 'సైరా' సెట్ కు పవన్ కల్యాణ్ వెళ్లిన వేళ, తీసిన చిత్రాలు తాజాగా బయటకు వచ్చి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.