రాజశేఖర్ 'కల్కి' సినిమాలో నాయికగా ధన్సిక!
Add ap7am to your home Screen

రాజశేఖర్ 'కల్కి' సినిమాలో నాయికగా ధన్సిక!

  • ప్రశాంత్ వర్మకి ఓకే చెప్పిన రాజశేఖర్
  • టైటిల్ గా 'కల్కి' ఖరారు
  • మరో నాయికగా అంజలి?     
రాజశేఖర్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'గరుడ వేగ' భారీ విజయాన్ని సాధించింది. చాలా కాలం తరువాత రాజశేఖర్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో తరువాత సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని తెచ్చేది కావాలని రాజశేఖర్ భావించారు. ఈ కారణంగానే కథల ఎంపిక విషయంలో ఆయన శ్రద్ధ పెట్టారు. రీసెంట్ గా ఆయనకి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథను వినిపించడం, ఆయన ఓకే చేసేయడం జరిగిపోయాయి.

ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ .. రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అంజలిని కథానాయికగా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'కబాలి' మూవీలో రజనీ కూతురుగా చేసిన సాయిధన్సికను కూడా తాజాగా ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అంజలి స్థానంలో సాయిధన్సికను తీసుకున్నారా? లేదంటే ఇద్దరు కథానాయికలతో రాజశేఖర్ జోడీ కడుతున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.    
rajasekhar
sai dhansika

More Telugu News