ప్రియురాలితో సహజీవనం, ఆమె స్నేహితురాలితో ప్రేమాయణం... అడ్డంగా బుక్కయ్యాడు!
- హైదరాబాద్, బంజారాహిల్స్ లో ఘటన
- యువతికి మాయమాటలు చెప్పి సహజీవనం
- చూసి వెళ్లేందుకు వచ్చిన స్నేహితురాలిపైనా కన్ను
- బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్
ఇదే సమయంలో స్రవంతి స్నేహితురాలు ప్రియా చౌదరి, వారింటికి వచ్చి వెళుతుండేది. తన స్నేహితురాలి కోసం వచ్చి పోయే ప్రియపైనా ప్రేమ్ కన్ను పడింది. ఆమెకు కూడా మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఈ విషయం స్రవంతికి తెలియడంతో నిలదీసింది. దీంతో ఆమెపై దాడి చేసిన ప్రేమ్, తీవ్రంగా కొట్టడంతో పాటు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రేమ్ ను అదుపులోకి తీసుకున్నారు.