తెలుగు తెరకి యథార్థ ప్రేమకథా చిత్రం .. 'తారామణి'
Add ap7am to your home Screen

తెలుగు తెరకి యథార్థ ప్రేమకథా చిత్రం .. 'తారామణి'

  • తమిళంలో హిట్ కొట్టిన 'తారామణి'
  • తెలుగులోనూ అదే పేరుతో 
  • సెప్టెంబర్ 21వ తేదీన విడుదల    
తమిళం నుంచి వచ్చిన చాలా ప్రేమకథా చిత్రాలు తెలుగులో ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన అక్కడి ప్రేమకథలను ఇక్కడి తెరపైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలా తెలుగు తెరకి 'తారామణి' చిత్రం రాబోతోంది. తమిళంలో రామ్ దర్శకత్వంలో క్రితం ఏడాది 'తారామణి' సినిమా తెరకెక్కింది.

వసంత్ రవి .. అంజలి .. ఆండ్రియా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. చెన్నైలో జరిగిన ఒక యథార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అక్కడి యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో నచ్చడంతో కాసుల వర్షం కురిసింది. దాంతో అదే పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత డి. వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.   
anjali
andrea
vasanth

More Telugu News