దసరాకి వచ్చేస్తోన్న'పందెం కోడి 2'
- గతంలో హిట్ కొట్టిన 'పందెం కోడి'
- ఆ సినిమాకి సీక్వెల్ గా 'పందెం కోడి 2'
- విశాల్ సరసన కీర్తి సురేశ్
కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నిన్నటితో షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులోను అదే రోజున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తెలుగులో కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన దసరాకి పోటీ ఉన్నప్పటికీ రంగంలోకి దిగాలనే చూస్తున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ క్రేజ్ ను ఈ సినిమా మరింతగా పెంచుతుందేమో చూడాలి.