హెచ్‌సీయూ రిటైర్డ్ ఫ్రొఫెసర్ కాళ్లకు నమస్కరించిన పవన్.. తనది ఆయన స్థాయి కాదన్న జనసేనాని!

  • హెచ్‌సీయూ ప్రొఫెసర్ కు సన్మాన సభ
  • ఆయనకున్న మేధస్సు తనకు లేదని వ్యాఖ్య
  • నేర్చుకోవాలన్న తపన ఉందన్న పవన్
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఆదివారం హెచ్‌‌సీయూ ప్రొఫెసర్ ఎన్.సుధాకర్ రావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుధాకర్‌రావుకు ఉన్న మేధస్సు కానీ, తపన కానీ తనకు లేవన్నారు. అయితే, నేర్చుకోవాలన్న తపన మాత్రం ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాను పనిచేస్తున్నట్టు చెప్పారు.

ప్రసంగం ముగించిన అనంతరం పవన్ నేరుగా సుధాకర్ రావు వద్దకెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సుధాకర్ రావు గత నెలలోనే రిటైర్ అయ్యారు. సంచార జాతుల జీవనంపై 'ఎతనోగ్రఫీ ఆఫ్ ఎ నోమాడిక్ ట్రైబ్' అనే పుస్తకాన్ని రాశారు. సంచార జాతుల జీవనం గురించి ప్రపంచానికి తెలియజేసిన ఆయన సేవలు గొప్పవని కొనియాడుతూ పవన్ ఆయన కాళ్లకు నమస్కరించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Hyderabad
HCU
Jana sena
Ambedkar

More Telugu News