Mumbai: ప్రియురాలిని క్షమించమని అడిగేందుకు... ప్రియుడి నిర్వాకం!

షార్ట్స్‌లో చూడండి
తనపై ఆగ్రహంతో ఉన్న ప్రియురాలిని ప్రసన్నం చేయించుకునేందుకు ఆ ప్రియుడు చేసిన పనిని చూసి అవాక్కయ్యారు పోలీసులు, ప్రజలు. నిత్యమూ ముంబై నుంచి పింప్రి చించ్ వాడ్ ప్రాంతానికి వచ్చే తన ప్రియురాలికి 'సారీ' చెప్పేందుకు 300 హోర్డింగులను పెట్టించాడు నీలేశ్ ఖేడేకర్ అనే 25 ఏళ్ల యువకుడు. ఆ అమ్మాయి పేరు చెబుతూ, తనను క్షమించాలంటూ ఓ లవ్ సింబల్ తో ఈ హోర్డింగ్ లను పెట్టించాడు.

ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, ప్రజల ఆస్తిని చెడగొట్టడం, అనుమతులు తీసుకోకుండా అక్రమ హోర్డింగ్ లు పెట్టడం వంటి కేసులు నమోదు చేశారు. అతని ప్రియురాలు ముంబై నుంచి ఈ ప్రాంతానికి నిత్యమూ వస్తుందని, ఆమె వచ్చే దారిలో నీలేశ్ 300 హోర్డింగులను పెట్టించినట్టు గుర్తించామని తెలిపారు. నీలేశ్ మిత్రుడు విశాల్ షిండే సాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, పింప్రి మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Go Back to Shorts
Mumbai
Hordings
Lover
Sorry

More Telugu News