vajpayee: రేపు సాయంత్రం వాజ్ పేయి అంతిమ సంస్కారాలు

షార్ట్స్‌లో చూడండి
కాసేపట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. వాజ్ పేయి పార్థివదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రజలు, అభిమానులు, మద్దతుదారుల సందర్శనార్థం రేపు ఉదయం 9 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్ పేయి పార్థివదేహాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
Go Back to Shorts
vajpayee
New Delhi

More Telugu News