100 రోజులు పూర్తి చేసుకున్న 'మహానటి'.. థ్యాంక్స్ చెప్పిన టీమ్!
- సావిత్రి బయోపిక్ గా 'మహానటి'
- మే 9వ తేదీన భారీ విడుదల
- అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ
మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇంతగా ఆదరణ పొందుతూ, ఈ రోజుతో 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఇంతటి అఖండమైన విజయాన్ని సాధించడం పట్ల ఈ సినిమా టీమ్ హర్షాన్ని ప్రకటించింది. "మీ ఆశీర్వచన బలంతో .. ఆదరాభిమానాలతో ప్రపంచ వ్యాప్త విజేతగా నిలిచి, 100 రోజుల పండుగ జరుపుకుంటోన్న ఈ శుభ సందర్భంలో, ప్రేక్షక దేవుళ్లందరికీ ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.