తమిళంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. విడుదలకు చురుగ్గా ఏర్పాట్లు!
- చెన్నైలో ఆడియో రిలీజ్
- ఆగస్టు చివరిలో విడుదల చేసే అవకాశం
- తమిళనాడులో దర్శనమిస్తున్న సినిమా పోస్టర్లు

రోల్స్ ప్రైడ్ మీడియా బ్యానర్ పై ‘నెంజమెల్లా పలవన్నం’ పేరుతో ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ సోమవారం చెన్నై, ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ చిత్రానికి ఏఆర్ కే రాజా మాటలు, పాటలు రాశారు. ఈ కార్యక్రమానికి గిల్డ్ అధ్యక్షుడు జాకువార్ తంగం, పీఆర్వో సంఘం చీఫ్ విజయమురళి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల చివరిలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో నెంజమెల్లా పలవన్నం పోస్టర్లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి.