disha pathani: సెట్స్ పైకి రాని 'సంఘమిత్ర' .. ఆగిపోయిందంటూ టాక్

షార్ట్స్‌లో చూడండి
శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు సుందర్. సి దర్శకత్వంలో .. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో 'సంఘమిత్ర' సినిమాను నిర్మించాలనుకున్నారు. జానపదకథ తరహాలో ఈ సినిమా కొనసాగనుంది. ఈ కారణంగా ఈ సినిమాకి భారీస్థాయిలో గ్రాఫిక్స్ ను ఉపయోగించాలని భావించారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర కోసం ముందుగా శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో దిశా పఠానీని తీసుకున్నారు.

ఈ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ ఇంతవరకూ ఎక్కడా అందుకు సంబంధించిన సందడి కనిపించడం లేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ తాజా ఇంటర్వ్యూలో దిశా పఠానీ మాట్లాడుతూ .. 'సౌత్ లో ఒక భారీ ప్రాజెక్టుకి ఓకే చెప్పాను గానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు' అంది. సౌత్ లో ఆమె అంగీకరించిన పెద్ద సినిమా 'సంఘమిత్ర'నే. అందువలన ఈ సినిమా ఆగిపోయే అవకాశాలే ఎక్కువనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. 
Go Back to Shorts
disha pathani
sundar

More Telugu News