ఏపీలో పవన్ కు ఓటరు కార్డు మంజూరు... ఏలూరు చిరునామా!

  • ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకున్న పవన్
  • అదే ఇంటి చిరునామాతో ఓటరుగా నమోదు
  • ఓటరు కార్డు జారీ చేసిన అధికారులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పోస్టల్ కాలనీ, 7వ వీధి చిరునామాగా, పవన్ ఓటరుగా చేరారు. 'టీడీజడ్ 1107567' పేరిట ఆయనకు ఓటరు కార్డు కూడా జారీ అయింది. ఇక్కడి హౌస్ నంబర్ 27-21-19లో తాను ఉంటున్నట్టు పవన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.

కాగా, తన పూర్వీకుల సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి నుంచి తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు పవన్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆయన ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుంటానని చెప్పారు. ఇక్కడే ఓటు హక్కుకు దరఖాస్తు చేయించుకోవాలని ఉందని ఆయన అన్నారు కూడా. పవన్ దరఖాస్తును పరిశీలించిన అధికారులు, ఏలూరులో ఓటరుగా ఆయన్ను గుర్తిస్తూ, ఓటరు కార్డును జారీ చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
West Godavari District
Voter

More Telugu News