Kulsoom Nawaz: స్పృహలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ భార్య కుల్సుం!

షార్ట్స్‌లో చూడండి
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుం నవాజ్ స్పృహలోకి వచ్చారు. ఈ విషయాన్ని వారి కుమారుడు హుస్సేన్ నవాజ్ తెలిపారు. గత కొన్నాళ్లుగా కోమాలో వున్న ఆమె ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులను గుర్తు పడుతున్నారని, తాను చెప్పాలనుకున్నది సైగల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఆమె ఇంకా వెంటిలేటర్స్ మీదే వున్నారని చెప్పారు.

కేన్సర్ తో బాధపడుతున్న కుల్సుం లండన్ లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంచితే, అవినీతికి పాల్పడ్డ కేసులో నవాజ్ షరీఫ్ కి పదేళ్ల జైలు శిక్ష, ఆయన కూతురు మరియంకు ఎనిమిదేళ్ల శిక్ష, అల్లుడు కెప్టెన్ సఫ్ దార్ కు ఏడాది జైలు శిక్షను పాక్ కోర్టు విధించిన సంగతి విదితమే. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో నవాజ్, మరియంలు శిక్షను అనుభవిస్తున్నారు.
Go Back to Shorts
Kulsoom Nawaz
Nawaz Sharif

More Telugu News