మరో మలుపు తిరిగిన నటి భావన కేసు... హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరు హీరోయిన్లు!
- మహిళా న్యాయమూర్తి కావాలంటూ పిటిషన్
- సీబీఐకి కేసును అప్పగించాలన్న నటుడు దిలీప్
- రెండు పిటిషన్లనూ విచారణకు స్వీకరించిన హైకోర్టు
మాలీవుడ్ లో కలకలం రేపిన భావన వేధింపుల కేసులో మహిళా న్యాయమూర్తిని నియమిస్తామన్న కేరళ సర్కారు, ఇంతవరకూ ఆ పని చేయలేదు. ఇటీవలే దిలీప్ పై విధించిన నిషేధాన్ని సైతం 'అమ్మ' తొలగించింది. ఈ నేపథ్యంలో మహిళా జడ్జి అయితేనే విచారణ పారదర్శకంగా సాగి, సత్వర న్యాయం జరుగుతుందని హనీ రోజ్, రచనలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.