Nara Lokesh: దొంగబ్బాయి తన పేరును 'జగన్ మోదీ రెడ్డి'గా మార్చుకోవాలి: నారా లోకేశ్ సెటైర్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దొంగబ్బాయి జగన్ తన పేరును ‘జగన్ మోదీ రెడ్డి’గా మార్చుకుంటే బాగుంటుందని సెటైర్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో ‘గ్రామదర్శిని’ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019 నాటికి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని, ఉభయగోదావరి జిల్లాలకు ఐటీ పరిశ్రమలు తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘యువనేస్తం’తో నిరుద్యోగులను ఆదుకోబోతున్నామని చెప్పారు. సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని అన్నారు. కాగా, వేలివెన్నులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి లోకేశ్ తెలుసుకున్నారు. ఎన్టీఆర్ స్మారక సొసైటీ గోదాంను ఆయన ప్రారంభించారు.

 పవన్ నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపించడం లేదు

నిడదవోలు పర్యటనలో లోకేశ్ మాట్లాడుతూ, బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో 175 సీట్లు టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 25 పార్లమెంట్ సీట్లలోనూ టీడీపీని గెలిపిస్తే దేశ ప్రధానిని మనమే నిర్ణయిస్తామని, ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు. నేను పుట్టిన నాటికే మా తాత సీఎం. నేను స్కూల్ కు వెళ్తున్నప్పటికే మా నాన్న సీఎం. నాపై ఎప్పుడైనా అవినీతి ఆరోపణ వచ్చిందా? పవన్ నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపించడం లేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం జగన్, పవన్ మానుకోవాలి’ అని లోకేశ్ హితవు పలికారు.
Go Back to Shorts
Nara Lokesh
jagan

More Telugu News